Article

Telangana Jagruthi express thanks to CM KCR over special benefits to farmers

తేదీ: 13 ఏప్రిల్ 2017

పత్రికా ప్రకటన

రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రకటీంచిన చారిత్రాత్మక వ్యవసాయ విధానాల పట్ల తెలంగాణ జాగృతి అనుబంధ విభాగం రైతు జాగృతి హర్షం వ్యక్తం చేసింది. దశాబ్దాల తరబడి కునారిల్లిన తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి గారి నిర్ణయం పెద్ద ఊరటనిచ్చిందని, భవిష్యత్తుపై ఆశలు చిగురింప చేసిందని తెలంగాణ జాగృతి రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ కే.ఎల్.ఎన్ రావు, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి ఊపాధ్యక్షులు మేడె రాజీవ్ సాగర్, డా.అయాచితం శ్రీధర్ గార్లు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మహత్యల బాట నుండి స్వర్ణయుగం వైపు తెలంగాణ వ్యవసాయరంగం పయనించేందుకు ఈ విధానాలు సహకరిస్తాయని అన్నారు. రైతుల సంక్షేమంతో పాటు, అధిక మరియు మేలైన దిగుబడి వైపు మన వ్యవసాయ రంగం అనేక మైలురాళ్లు దాటుతుందని జాగృతి ఆశాభావం వ్యక్తం చేసింది.

చరిత్రలో తొలిసారిగా మొత్తం రూ.లు 16,374 కోట్లతో సంపూర్ణ రుణమాఫీ చేసి 35.30 లక్షల మంది రైతులను రుణవిముక్తుల్ని చేయడం అపూర్వమైనదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు, భక్తరామదాసు వంటి పలు నూతన ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పలు జిల్లాల్లో పచ్చదనం విస్తరిస్తుందనీ తెలిపారు. కర్నూలు జిల్లాలో కరువు నెలకొని ఉంటే వలసలకు నెలవైన పక్కనే ఉన్న పాలమూరు జిల్లాలో పచ్చదనం పరిడవిల్లుతుందని ప్రశంసించారు. నేడు వలసలు తగ్గుముఖం పట్టడమే కాకుండ బయటి నుండి కూలీలు ఇక్కడికి వ్యవసాయ పనులకోసం వస్తున్నారని పేర్కొన్నారు. మరో వైపు రైతాంగానికి 9 గంటలు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్తు అందిచడం దేశ చరిత్రలో ప్రథమం అని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది నుండి రాష్ట్రంలోని రైతులందరికి 24 లక్షల నుంచి 26 లక్షల టన్నుల వరకు ఎరువులు రైతులకు ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించాడం ఎవరూ ఊహించనిదన్నారు. ఎకరానికి 2 దుక్కి మందు, 3 యూరియా బస్తాలను ఉచితంగా ఇస్తామనడం ముదావహం. ఎకరానికి రూ. 4 వేల నుంచి నాలుగున్నర వేల వరకు పెట్టుబడి కూడా ప్రభుత్వమే భరిస్తదని చెప్పడం బక్క రైతులకు పెద్ద భరోసా అని జాగృతి నాయకులు తెలిపారు.

గతంలో రైతు వ్యతిరేక విధానాలతో అనేకమంది రైతులు ఆత్మహత్యల బాటన పట్టారని, తెలంగాణ సాధించుకున్న తొలినాళ్లలోనూ ఆ గతం తాలూకు విష ఫలితాలు వేంటాడాయని అన్నారు. వ్యవసాయం దండగని పరాయి పాలకులు అన్న గడ్డమీదే ఇవ్వాల వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వానికి జేజేలు పలికారు. అలాగే నూతన వ్యవసాయ విధానాలైన బిందు సేధ్యం, తుంపర సేధ్యం, పాలి హౌజ్ విధానాలకు ప్రభుత్వం ఊతమివ్వడం నేటీ యువతలో వ్యవసాయం పై మక్కువ పెంచుతుందని అన్నారు. తెలంగాణ బిడ్దలే తమ రాష్ట్రాన్ని పాలించుకుంటే వచ్చే ప్రయోజనాలకు ఇవి మచ్చుతునకలన్నారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ దారిలో తెలంగాణ దేశంలో నే అత్యుత్తమ వ్యావసాయిక రాష్ట్రంగా అవతరిస్తుందని అన్నారు. ఆకలి పేదరికం లేని హరిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దుతున్నందుకు తెలంగాణ జాగృతి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top