Thursday, October 28, 2021

Krishna..ప్రజలతో ఎమ్మెల్యే ‘ముఖాముఖి’


జిల్లాలోని పెడన పట్టణంలో నియోజకవర్గ శాసన సభ్యుడు జోగి రమేశ్ బుధవారం వైసీపీ కార్యాలయంలో ప్రజలతో ‘ముఖాముఖి’ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేకు తమ సమస్యలపై విన్నవించారు. ఈ క్రమంలోనే ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న శాసన సభ్యుడు జోగి రమేశ్ అప్పటికప్పుడు కొన్ని సమస్యలను పరిష్కరించారు.

ఈ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. అర్జీలను పరిష్కరించాలని శాసన సభ్యుడు వెంటనే ఆయా ప్రభుత్వ శాఖల అధికారులకు చేరవేశారు. పలు సమస్యలపై ఎమ్మెల్యే ఫోన్ ద్వారా అధికారులకు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలుంటే ప్రజలు స్థానిక వైసీపీ నాయకులకు తెలపాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు.

 

Related Articles

Latest Articles