Wednesday, October 20, 2021

Nalgonda..ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసిన మంత్రి


జిల్లావ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన టీచర్స్‌కు మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి శనివారం అవార్డులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని చిన్న వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్‌లో 109 మంది ఉపాధ్యాయులకు మంత్రి అవార్డులు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులే భావి భారత నిర్మాతలన్నారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందని పెద్దలు చెప్తుంటారని, ఈ నేపథ్యంలోనే విద్యార్థులను సన్మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపైన ఉందని చెప్పారు.

ఇకపోతే కరోనా నిబంధనలు పాటిస్తూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే, పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం తక్కువగానే ఉంది. క్రమంగా విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకుగాను అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని ఆఫీసర్స్ చెప్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

 

The post Nalgonda..ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసిన మంత్రి first appeared on The Telugu News.

Related Articles

Latest Articles