Wednesday, October 20, 2021

Amaravati..పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా.. ఫలితాలు బాధ్యత పెంచాయన్న సీఎం


ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజల దీవెనలతోనే పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినట్లు జగన్ తెలిపారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏపీలోని ప్రతీ కుటుంబం, ప్రతీ మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 13,081 పంచాయతీలకుగాను 10,536 పంచాయతీల్లో అనగా 81 శాతం వైసీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని వివరించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల అనగా 99 శాతం వైసీపీ అభ్యర్థులే గెలిచారని పేర్కొన్నారు. ప్రతీ ఎన్నికల్లో సడలని ప్రేమను, అప్యాయతను ప్రజలు పంచుతున్నారన్నారు. ప్రతిపక్షం ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో లేదని విమర్శించారు. వైసీపీ సర్కారును ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించినప్పటికీ, ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం జగన్ పేర్కొన్నారు.

 

 

Related Articles

Latest Articles