Thursday, October 28, 2021

Warangal.. దేశానికే దిక్సూచి తెలంగాణ సీఎం కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి


తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి దేశానికే దిక్సూచిగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం మంత్రి జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని చెరువులకు జలకళ వచ్చిందన్నారు.

ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసి, మత్స్య సంపదను పెంపొందించిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. రైతుల కోసం నీరు, కరెంటు ఉచితంగా అందిస్తూ రైతులకు అండగా నిలచిన సర్కరు టీఆర్ఎస్ సర్కారు అని పేర్కొన్నారు. రైతాంగం కోసం రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్యా, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

Related Articles

Latest Articles