Sunday, December 5, 2021

Vishakapatnam.. క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన


అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏపీలోని విశాఖపట్టణం పోర్టులో చేపట్టిన ఇంటర్నేషనల్ క్రూయిజ్‌ టెర్మినల్‌ అభివృద్ధి పనులకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాగూర్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి విశాఖకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి క్రూయిజ్‌ టెర్మినల్‌ అభివృద్ధి పనులుతో పాటు ఓఆర్‌ఎస్‌ జెట్టీ మరమ్మతు పనులు, కవర్డ్‌ స్టోరేజ్‌ యార్డ్‌ నిర్మాణ పనులు, ఐఎన్‌ఎస్‌ డేగ వద్ద ట్రక్కు పార్కింగ్‌ టెర్మినల్‌ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఓడరేవలు, షిప్పింగ్ రంగం అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ద్వారా పర్యాటకులు ఈజీగా ఆకర్షితులవుతారని చెప్పారు. విశాఖ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తుతారని చెప్పారు. కేంద్రం మంత్రి పర్యటనలో ఆయన వెంట పోర్ట్‌ చైర్మన్‌ రామమోహనరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Related Articles

- Advertisement -

Latest Articles