Saturday, November 27, 2021

Rashmika Mandanna : గర్ల్ ఫ్రెండ్ లేదన్న నెటిజన్.. బంపర్ ఆఫర్ ఇచ్చిన రష్మిక మందన్నా | The Telugu News


Rashmika Mandanna : హీరోయిన్ల మీదున్న ప్రేమను అభిమానులు రకరకాలుగా తెలుపుతుంటారు. అలా రష్మిక మందన్నాకు ఇప్పుడు మామూలుగా ఫాలోయింగ్ లేదు. నేషనల్ క్రష్‌గా రష్మిక మందన్నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రష్మిక మందన్నా చేసే అల్లరి చేష్టలకు ఎంతో మంది అభిమానులున్నారు. సినిమా హట్ అయినా ఫట్ అయినా కూడా రష్మికకు మాత్రం క్రేజ్ పెరుగుతూనే వస్తోంది.ఇప్పుడు రష్మిక చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో బాలీవుడ్‌లోంచే రెండు మూడు ప్రాజెక్ట్‌లున్నాయి.

Rashmika Mandanna On Netizen Says Dont Have Lover

ఇక తెలుగులో రెండు సినిమాలున్నాయి. ఆల్రెడీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు కోలీవుడ్‌లోనూ కొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా రష్మిక మందన్నా తన ట్విట్టర్ ఖాతాలో కాస్త యాక్టివ్ అయింది.అభిమానుల ప్రేమకు, నెటిజన్ల ట్రోలింగ్‌కు ఒకే రకంగా స్పందించే రష్మిక మందన్నా తాజాగా ఓ ఫ్యాన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓ అభిమాని ట్వీట్ వేస్తూ.

Rashmika Mandanna గర్ల్ ఫ్రెండ్ అంటూ రష్మిక ఆఫర్

rashimika mandanna
rashimika mandanna

నా ఫోన్‌లో నా లవర్ మీ ఫోటోలే ఎక్కువగా ఉండటం చూసి హర్ట్ అయింది. నేనంటే ఎక్కువ ఇష్టమా? రష్మిక అంటే ఎక్కువగా ఇష్టమా? అని అడిగితే.. నువ్వంటేనే ఎక్కువ ఇష్టమని ఆమెకు అబద్దం చెప్పాను అంటూ రష్మికకు సారీ చెప్పాడు. నేను కూడా అలానే చెబుదామని అనుకున్నాను కానీ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని మరో నెటిజన్ కామెంట్ వేశాడు. నేను నీ గర్ల్ ఫ్రెండ్‌ని కాదా? అంటూ కొంటెగా అడిగేసింది.

Related Articles

- Advertisement -

Latest Articles