Saturday, November 27, 2021

Anasuya Bharadwaj : కారులోంచే ముద్దుల వర్షం.. యాంకర్ అనసూయ మామూల్ది కాదు | The Telugu News


Anasuya Bharadwaj అనసూయ అప్పుడప్పుడు కొత్త లుక్కులను ట్రై చేస్తుందన్న సంగతి తెలిసిందే. వెరైటీ గెటప్పులో అనసూయ కనిపించినప్పుడల్లా ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. జబర్దస్త్ షోకోసం వారం వారం వెరైటీ గెటప్పులు, వెరైటీ హెయిర్ స్టైల్స్‌ను అనసూయ ట్రై చేస్తుంటుంది. ఇక తన జుట్టు కోసం, దాని సంరక్షణ కోసం ఎంతలా టైం కేటాయిస్తుంటుందో అందరికీ తెలిసిందే. తన జుట్టుకు అంత పొడుగ్గా, లావుగా ఎలా ఉంది? ఎలా దాన్ని మెయింటైన్ చేస్తుంటుందో చెబుతూ ఓ వీడియోను కూడా వదిలింది.

anasuya-bharadwaj-overjoys-on-her-new-look

వారానికి ఒకసారి హెయిర్ కేర్ సెంటర్‌కు వెళ్తానని, గత పదేళ్ల నుంచి ఒకరి వద్దే తన హెయిర్ కేర్ చేసుకుంటానని చెప్పింది. అలా తన జుట్టును తన కంటే ఎక్కువగా అతడే చూసుకుంటాడని అనసూయ చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆదివారం నాడు అనసూయ తన జుట్టుకోసమే సమయం కేటాయించినట్టు కనిపిస్తోంది. వెరైటీ హెయిర్ స్టైల్‌ను అనసూయ ట్రై చేసింది. జుట్టుకు రకరకాల రంగులు వేసేసింది. మొత్తానికి అనసూయ మాత్రం తన గెటప్ మార్చేసింది.

Anasuya Bharadwaj కారులోనే అనసూయ ముద్దులు..

anasuya-bharadwaj-overjoys-on-her-new-look
anasuya-bharadwaj-overjoys-on-her-new-look

తన రంగు రంగుల జుట్టును చూపిస్తే.. నా జుట్టు నా ఇష్టం.. నా హెయిర్ నా రూల్స్.. సండే మొత్తం హెయిర్ కేర్ కోసం అంటూ ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్‌లతో తన కొత్త హెయిర్ స్టైల్ గురించి అనసూయ చెప్పుకొచ్చింది. అయితే ఆ హెయిర్ స్టైల్ మీద నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. హెయిర్ స్టైల్ బాగుందని అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తుండటంతో అనసూయ గాల్లో తేలిపోయింది. అలా కారులో ప్రయాణిస్తుండగా.. తన అభిమానులకు ముద్దుల వర్షాన్ని కురిపించింది.

Related Articles

- Advertisement -

Latest Articles