Saturday, November 27, 2021

IPL : భారీస్థాయికి ఐపీఎల్ టీమ్‌ల షేర్ల విలువ.. అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్.. | The Telugu News


IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్‌ల షేర్ల విలువ భారీ స్థాయిలో పెరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఐపీఎల్ న్యూ టీమ్స్‌కు వేలం పాట జరగనుంది. ఈ క్రమంలోనే నూతన జట్ల ధరలు భారీగా పెరగనున్నాయట. కనీసంగా జట్ల ధర రూ. 8 వేల కోట్ల వరకు చేరుతుందని అనుకుంటున్నారు. ఆ లెక్కన ఒక్కో షేర్ ధర రెండొందల రూపాయలకు చేరుతుందని అంచనా.ఐపీఎల్ విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అపూర్వ విజయం సాధించి సీటీమార్ కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్. ఐపీఎల్ 2021 టైటిల్ కైవసం చేసుకున్న నేపథ్యంలో చెన్నైసూపర్ కింగ్స్ టీంలో జోష్ వచ్చింది. ధోని సేన నాల్గో సారి టైటిల్ నెగ్గడం పట్ల క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంగతులు ఇలా ఉంచితే..

ipl teams share value will be increased soon

చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క షేర్ ధర తాజాగా రూ.135 పలికింది. ఆ ప్రకారంగా ఐపీఎల్ టీమ్ అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ మార్కెట్ ధర రూ.4,200 కోట్లుగా ఉంది. అయితే, చెన్నైసూపర్ కింగ్స్ టీమ్ ఒక్కటే కాదు .. మిగతా ఐపీఎల్ టీమ్‌ల షేర్ల విలువ కూడా భారీ స్థాయికి పెరగనుంది. మొత్తంగా కొత్త టీమ్‌ల వేలం పాట.. పాత టీమ్‌ల ఓనర్స్‌కు జోష్ ఇవ్వనుంది. ఐపీఎల్ నిర్వహణ తొలిసారిగా 2008లో జరగగా, అప్పట్లో జరిగిన వేలం పాటలో ఒక్కో టీమ్‌ను యాజమాన్యాలు దాదాపు రూ.400 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాయి. ఇకపోతే అప్పట్లో అత్యల్ప ధర పలికిన జట్టుగా రాజస్థాన్ రాయల్స్ ఉంది. మిగతా టీమ్‌లన్నిటికీ 400 నుంచి 500 కోట్ల రూపాయల ధర పలికింది. ఐపీఎల్ ఫస్ట్ ఇయర్ బాగా సక్సెస్ అయింది.

IPL : చెన్నై సూపర్ కింగ్స్ షేర్ ధర పెరుగుదల..

MS dhoni sensational comments Ipl 2021
MS dhoni sensational comments Ipl 2021

కానీ, యాజమాన్యాలకు నష్టం వాటిల్లినట్లు వార్తలు రావడం గమనార్హం. ఒక్కో టీమ్ రూ.10 నుంచి 30 కోట్లు లాస్ అయినట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, అలా వార్తలు వచ్చినప్పటికీ ఐపీఎల్ టీమ్‌ల మార్కెట్ వాల్యూ క్రమంగా పెరుగుతూ రావడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రజెంట్ షేర్ వాల్యూ చూస్తే కనుక అది దాని ఫ్రాంచైజీ సంస్థను దాటేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇండియా సిమెంట్స్ వాళ్లు అప్పట్లో చెన్నైసూపర్ కింగ్స్ టీమ్‌ను వేలం పాటలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Latest Articles