Saturday, November 27, 2021

Tirumala : నేటి నుంచి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదల | Tirumala Srivari special darshan tickets released from today


తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు నేటి నుంచి విడుదల కానున్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

Srivari special darshan tickets : తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు నేటి నుంచి విడుదల కానున్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 9గంటలకు 3వందల రూపాయలకు సంబంధించిన 12వేల టికెట్లను విడుదల చేయనున్నారు. రేపు ఉదయం నుంచి 10వేల సర్వదర్శన టికెట్లను జారీ చేయనున్నారు.

శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను గోవింద యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రూ.300 టోకెన్లు, సర్వ దర్శనం టోకెన్లు ఇవాళ, రేపు విడుదల కానుండటంతో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రూ.300 టోకెన్లు దొరక్కపోయినా సర్వ దర్శనం టోకెన్లు తీసుకోవాలని భావిస్తున్నారు.

Tirumala : అక్టోబ‌రు 31 నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

అలాగే ఈ నెల 23న నవంబర్‌ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనుంది. రోజులకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనుంది. సర్వదర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో శ్రీనివాసం కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌ టికెట్‌ కౌంటర్‌ను మూసివేశారు.

Related Articles

- Advertisement -

Latest Articles