Monday, November 29, 2021

Movie: పుష్ప నుండి కొత్త పోస్ట‌ర్.. ఊర‌మాస్ గా బ‌న్నీ, ర‌ష్మిక‌


ఈ మ‌ధ్య కాలంలో పాన్ ఇండియా మూవీస్ తెర‌కెక్కుతున్నాయి. వాటిల్లో ఒక‌టి పుష్ప‌. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న డీ గ్లామ‌ర్ లుక్ లో క‌నిపించ‌నున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ చిత్రం నుండి రిలీజ్ చేస్తున్న‌ సాంగ్ ప్రోమోలు.. పోస్ట‌ర్స్ లుక్ చూస్తుంటే ఇది ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తోంది.

పుష్ప చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. మొద‌టి భాగాన్ని డిసెంబ‌ర్ 17న రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్. మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ మ‌రో అద్భుత‌మైన చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కి అందించ‌నున్నార‌ని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ చూస్తే..అల్లు అర్జున్..ర‌ష్మిక మాస్ ని మించేలా ఊర‌మాస్ లుక్ లో ఆక‌ట్టుకుంటున్నారు. ప‌క్కాగా ఈ చిత్రం బ‌న్నీకి మ‌రో హిట్ ని అందిస్తుంద‌నే అంటున్నారు ఫ్యాన్స్.

Related Articles

- Advertisement -

Latest Articles