Thursday, December 2, 2021

Today horoscope : అక్టోబ‌ర్ 27 2021 బుద‌వారం మీ రాశిఫ‌లాలు | The Telugu News


today horoscope మేషరాశి ఫలాలు : ఈరోజు బాగా శ్రమించాల్సిన రోజు. కానీ మంచి ఫలితాలు పొందుతారు. షేర్లు, బెట్టింగ్లకు దూరంగా ఉండండి. ఇంట్లో చిన్ని సమస్యలు రావచ్చు. ఎవరితో వాగ్వివాదాలకు దిగకండి. బంధవులు నుంచి సర్ప్రైజ్ అందుకుంటారు. మీ సృజనాత్మకతకు ప్రశంసలు అందుకుంటారు. పాలతో శివాభిషేకం చేయండి. వృషభరాశి ఫలాలు : ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. అనుకూలమైన రోజు. ప్రేమలో పడుతారు. మీ వస్తువులు జాగ్రత్త దొంగతనానికి గురి అయ్యే అవకాశం ఉంది. టెన్షన్లు ఉంటాయి. వైవాహికంగా సామాన్యంగా ఉంటుంది. శ్రీ సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

today horoscope in telugu

మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతమైన రోజు, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆరోగ్యం మీ సొంతం. వాగ్దానాలు చేయకండి. విద్యార్థులు ఆటలపై మనసు పెట్టకండి. వైవాహికంగా సానుకూలం. కుష్మాండ దానం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా మంచి స్తితిలో ఉంటారు. దీని వల్ల మానసిక శాంతి. పిల్లల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమలో సర్ప్రైజ్ లభిస్తుంది. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి. చదువుపై దృష్టిపెట్టాల్సిన రోజు. దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

today horoscope సింహరాశి ఫలాలు : ఈరోజు అనవసరంగా ప్రయాణాలు చేయకండి. సందేహంతో పనులు ప్రారంభించంకండి. వత్తిడి, టెన్షన్లతో ఈరోజు గడుస్తుంది. విందులకు, వినోదాల గురించి ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు మంచి మార్కులు పొందుతారు. మంచి ఆర్థిక లాభాల కోసం శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

కన్యారాశిఫలాలు : ఈరోజు సానుకూలమైన వాతావరణం. ఆఫీస్లో మంచి పేరు వస్తుంది. మీ తెలివి తేటల వల్ల దురదృష్టానికి దూరంగా పోతారు. ప్రేమికులు జాగ్రత్త. సంతానానికి విలువైన సూచనలు చేయాల్సిన రోజు. వైవాహికంగా సంతోషం నిండిన రోజు. తులసీ ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది.

Daily horoscope in telugu
Daily horoscope in telugu

today horoscope తులారాశి ఫలాలు : ఈరోజు వత్తిడి నుంచి రిలీఫ్ పొందుతారు. పనులు సాఫీగా సాగుతాయి. బంధవుల నుంచి సహాయం అందుతుంది. సమస్యలు పోయి మంచి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా బహుళ ప్రయోజనాలు పొందుతారు. వైవాహికంగా చాలా మంచి అనుభూతులను పొందుతారు. శ్రీ హనుమాన్ దేవాలయ దర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

today horoscope వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ధనం విషయంలో జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిన సమయం. ఎవరికి అప్పులు ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో అనేక ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి మార్కులు వస్తాయి. వివాహం అయిన వారి మధ్య అభిప్రాయ బేధాలు రావచ్చు జాగ్రత్త. ఈరోజు అమ్మవారిని పారిజాత పుష్పాలతో ఆరాధన చేయండి.

today horoscope ధనస్సురాశి ఫలాలు : ఈరోజు అవసరానికి ధనం అందక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీ ఇంటికి బంధువులు లేదా మిత్రులు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వేళలో జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులకు మంచి ఫలితాన్ని పొందుతారు. గంగా జలాన్ని ఉపయోగించి శివాభిషేకం చేసుకోండి.

today horoscope మకరరాశి ఫలాలు : ఈరోజు ధనాన్ని పొదుపు చేస్తారు. ముఖం పై చిరునవ్వులు పూస్తాయి. ప్రేమ భాగస్వామితో ఆనందంగా మాట్లాడుతారు. ఆఫీస్లో బాగా ఓపికతో పనిచేయాలి. విద్యార్థులు మంచి వార్తలు వింటారు. జీవిత భాగస్వామితో రొమాంటిక్ గా గడుపుతారు.
ఇంట్లో దీపారాధన చేయండి.

today horoscope in telugu
today horoscope in telugu

కుంభరాశి ఫలాలు : ఈరోజు సమస్యలు ఎదురుకావచ్చు. మీ అలసత్వంతో సమస్యలు ఎదురుకావచ్చు. ఆర్థికంగా నిర్వీర్యంగా ఉంటుంది. మీ శ్రమకు ఆఫీస్లో ప్రశంసలు వస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందపు మత్తులో తేలుతారు. ఆకుపచ్చ దుస్తులు ధరించండి మంచి పలితాలు వస్తాయి.

మీనరాశి ఫలాలు : ఈరోజు సానుకూలతలు నిండిన రోజు. ఆర్థికంగా బాగా ఉంటుంది. ఆహ్లాదకరమైన రోజు. ప్రియమైన వ్యక్తుల కలిసే అవకాశం ఉంది. ఈరోజు జీవిత భాగస్వామి మధ్య విబేధాలు రావచ్చు. విద్యార్థులకు శ్రమించాల్సిన రోజు. ఇంటికి బంధువులు లేదా అతిథులు వస్తారు. నవగ్రహాలకు ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

Related Articles

- Advertisement -

Latest Articles