Wednesday, December 1, 2021

Bride Died : పెళ్లింట విషాదం..రోడ్డు ప్రమాదంలో వధువు మృతి | The bride died in a road accident, kurnool


కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో పెళ్లింట విషాదం నెలకొంది. కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదంలో వధువు మృతి చెందింది. ప్రియుడితో కలిసివెళ్తూ బైక్ పై నుంచి పడి చనిపోయింది.

bride died in a road accident : కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలంలో పెళ్లింట విషాదం నెలకొంది. కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదంలో వధువు మృతి చెందింది. పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో కలిసి వెళ్తూ బైక్ పై నుండి కింద పడి మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం..వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన అరుణకు..చెరుకులపాడుకు చెందిన మేనమామతో ఈ నెల 19వ తేదీన వివాహం నిశ్చయమైంది. సర్టిఫికెట్ తెచ్చుకుంటానని చెప్పి అరుణ ఇంటి నుండి వెళ్లిపోయింది.

అయితే పెద్దలు కుదిర్చిన వివాహం కాదని..నిన్న ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్ష్మిపురంకు చెందిన ప్రియుడు వెంకటేశ్వర్లుతో అరుణ వెళ్లి పోయింది. ప్రియుడు వెంకటేశ్వర్లుతో వెళ్తూ మార్గమధ్యంలో వెల్దుర్తి మండలం ఎంబాయి దగ్గర బైక్ పై నుంచి కింద పడి అరుణ మృతి చెందింది. కర్నూలు వైద్యశాలలో మృతదేహానికి పంచనామా నిర్వహించారు.

Woman Fraud : మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయమై, పెళ్లి పేరుతో రూ.17.89 లక్షలు దోచేసిన యువతి

అరుణ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. అరుణను తీసుకెళ్లిన వ్యక్తి వెంకటేశ్వర్లు తమకు ఎవరో తెలియదని కుటుంబ సభ్యులు అంటున్నారు. అరుణ మృతిపై పోలీసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. డోన్ డీఎస్పి శ్రీనివాసరెడ్డి.. ప్రియుడు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియుడితో కలిసి వెళ్తూ ప్రమాదంలో మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Latest Articles