Wednesday, December 1, 2021

Jabardasth faima : ఎగిరితన్నిన ఫైమా.. దెబ్బకు షాకైన బుల్లెట్ భాస్కర్ | The Telugu News


Jabardasth faima : ప్రస్తుతం జబర్దస్త్ ఫైమా ఫుల్ ఫామ్‌లో ఉంది. తనదైన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొడుతుంది. ముఖ్యంగా ఫైమా భాస్కర్ స్కిట్‌లోకి ఎంట్రీ ఇచ్చాక బుల్లెట్‌లాగా దూసుకుపోతుంది. ముఖ్యంగా భాస్కర్, ఇమ్మాన్యుయేల్‌లతో ఫైమా చేసే కామెడి వేరే లెవల్ అనే చెప్పాలి. షోకి జడ్జిలుగా ఉన్న రోజా, మనోలు కూడా ఫైమా ఫర్ఫామెన్స్‌కు ఫిదా అయిపోతున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సారి రెచ్చిపోయింది.

Jabardasth faima and Bullet Bhaskar excellent performance

తాజాగా ఓ స్కిట్‌లో అదిరిపోయే ఫర్పామెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదిరిపోయే పంచ్ డైలాగ్‌లో భాస్కర్‌ను ఓ ఆట ఆడుకుంది. యాచకురాలి పాత్రలో స్టేజి మీదకి వచ్చిన ఫైమా.. పువ్వు నెత్తి మీద ఎందుకు పెట్టావు అని ప్రశ్నించగా.. నేను మా టీమ్ లీడర్‌ను నెత్తి మీద పెట్టి చూసుకుంటా అని ఫైమా సమాధానమిస్తుంది. మరి పువ్వు పెట్టావు అని భాస్కర్ అడగడంతో.. మా టీమ్ లీడర్ పువ్వే కదా అంటూ ఫైమా కౌంటర్ వేస్తుంది.

Jabardasth faima : భాస్కర్‌ను తన్నిన ఫైమా

Jabardasth faima and Bullet Bhaskar excellent performance
Jabardasth faima and Bullet Bhaskar excellent performance

ఆ తర్వాత భాస్కర్ ఫైమాను తోసేయగా.. ఫైమా కోపంతో వచ్చి ఎగిరి భాస్కర్ తలపై చేతిలోని పాత్రతో కొట్టింది. భాస్కర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో అంతా ఫుల్‌గా నవ్వేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ఇమ్మాన్యుయేల్ భాస్కర్ ఏమైందని అడగ్గా.. భాస్కర్ ఏడ్చుకుంటూ నేను చచ్చిపోతా అంటూ చెప్తాడు. అలాగే ముందుకు కదులుతాడు.. అప్పుడే ఇమ్మాన్యుయేల్ భాస్కర్‌‌ను కొట్టడంతో కిందపడిపోతాడు. ప్రస్తుతం ఈ ఏపిసోడ్‌కు ప్రోమో యూట్యూబ్‌లో సందడి చేస్తుంది. ఫైమా ఫర్ఫామెన్స్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles