Monday, December 6, 2021

Farmers Attack On Police : పోలీసులపై దాడి చేసిన చెరుకు రైతులు | Farmers Attack On Police


విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.

Farmers Attack On Police :  విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయ్‌. ఫ్యాక్టరీకి చెరుకు అమ్మిన రైతులు బకాయిలు చెల్లించాలని కోరుతూ  ఆందోళన బాట పట్టారు. ఫ్యాక్టరీలోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

రైతులు రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. రైతుల దాడి నుంచి తప్పించుకోటానికి పోలీసులు కొన్ని సందర్భాల్లో వెనుతిరగాల్సి వచ్చింది. కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు.
Also Read : Porn Addiction : శాడిస్ట్ భర్త…పోర్న్ సైట్లు చూస్తూ…
చెరకు ఫ్యాక్టరీ, రైతులకు రూ.16 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా తమ బకాయిలు రాబట్టుకోవటం కోసం రైతులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసుకున్నా  అటు ప్రభుత్వంనుంచి కానీ ఇటు ఫ్యాక్టరీయాజమాన్యం నుంచి కానీ సరైన సమాధానం  రాకపోవటంతో ఈరోజు రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈక్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు పయత్నం చేశారు. ఈనేపధ్యంలో కొందరు రైతులు ఆగ్రహంతో పోలీసులపై దాడికి దిగారు.

Related Articles

- Advertisement -

Latest Articles