Sunday, December 5, 2021

ఐపీఎల్ ను అనడం తప్పు : గంభీర్


ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దాంతో భారత జట్టు పై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీం ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడితే చాలు అనుకుంటున్నారు అని విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఐపీఎల్ పై వస్తున్న విమర్శలను తప్పుబట్టారు. అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ ఓడిపోతే అందరూ ఐపీఎల్ ను అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మిగితా జట్లు కూడా మనకంటే బాగా ఆడతాయి అనేది తెలుసుకోవాలి. దానిని మీరు ఎంత త్వరగా అంగీకరిస్తారో… అది మీకు అంత మంచిది అన్నారు. ఇక కివీస్ పై ఆడిన మ్యాచ్ లో ఆటగాళ్లు ధైర్యంగా లేరు. దానికి ఐపీఎల్ కు సంబంధం ఏంటి అని అడిగిన గంభీర్… 2019 ప్రపంచ కప్ లో సెమీ-ఫైనల్‌ కు వచ్చిన సమయంలో కూడా… ఐపీఎల్‌లో ఆడి మేము ప్రపంచ కప్‌ కు వచ్చాము అని గుర్తు చేసారు గంభీర్.

Related Articles

- Advertisement -

Latest Articles