Sunday, December 5, 2021

Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం |5 Died in Massive Road Accident in Anantapur district


అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి దగ్గర జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

Anantapur District : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి దగ్గర జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో పదిమంతి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా గార్లదిన్నె మండలంలోని కొప్పలకొండకు చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వారు, గాయపడిన వారంతా వ్యవసాయ కూలీలు. రోజూ పని కోసం వివిధ గ్రామాలకు వెళ్తుంటారు. ఇవాళ కూడా పత్తి తీయడానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో కూలీల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Read Also : Hyderabad : గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం  

Related Articles

- Advertisement -

Latest Articles