Monday, December 6, 2021

‘రైజ్ ఆఫ్ శ్యామ్’ టైటిల్ సాంగ్‌ రిలీజ్


నేచుర‌ల్ స్టార్ నాని sతాజాగా మూవీ శ్యామ్ సింగ‌రాయ్‌. రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు.  శ్యామ్ సింగ‌రాయ్ జోడీగా సాయి పల్లవి, కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ నటిస్తున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శ‌నివారం ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ అంటూ టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీత అందించారు. రైజ్ ఆఫ్ శ్యామ్ పాట‌ను కృష్ణ‌కాంత్ రాయ‌గా, విశాల్ ద‌డ్లాని, అనురాగ్ కుల‌క‌ర్ణి పాడారు.

ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, భాష‌ల్లోనూ విడుద‌ల కానుంది. నాని కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. సినిమాను క్రిస్మ‌స్ కానుకగా నాలుగు భాష‌ల్లో డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌బోతున్నారు.Related Articles

- Advertisement -

Latest Articles