Monday, December 6, 2021

CM KCR : శాంతమ్మకు నివాళి అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ | KCR pays tribute to Minister Srinivas Gowda’s mother


CM KCR : ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సీఎం కేసీఆర్‌ ఆదివారం పరామర్శించారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు మృతి చెందారు.. ఆమెకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మ కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు.

చదవండి : CM KCR : టీఆర్ఎస్ కు అధిష్టానం లేదు.. తెలంగాణ ప్రజలే బాస్ లు : సీఎం కేసీఆర్

మహబూబ్‌నగర్ భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. సీఎం కేసీర్‌తోపాటు మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ గత నెల 29న కన్నుమూసిన విషయం తెలిసిందే.

చదవండి : CM KCR: తెలంగాణ‌లో 24 గంట‌లు క‌రెంట్ ఇస్తున్నాం.. ఏపీలో కోతలు ఉన్నాయి

The post CM KCR : శాంతమ్మకు నివాళి అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ appeared first on 10TV.

Related Articles

- Advertisement -

Latest Articles