Monday, November 29, 2021

Vaccination : వ్యాక్సిన్‌ వేస్తే.. ఉరేసుకుంటా.. ఆరోగ్య కార్యకర్తలకు చుక్కలు చూపించిన వృద్ధురాలు | old woman not accept to vaccination in jangaon district


కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. తెలంగాణలోని కొన్ని గ్రామాలు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని రికార్డు సృష్టించాయి.

Vaccination : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. తెలంగాణలోని కొన్ని గ్రామాలు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని రికార్డు సృష్టించాయి. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో వ్యాక్సిన్ వేసేందుకు వచ్చిన ఆరోగ్య కార్యకర్తలకు ఓ వృద్ధురాలు చుక్కలు చూపించింది.

చదవండి : Telangana Vaccine : తెలంగాణాలో దీపావళి రోజు వాక్సిన్‌కు హాలిడే..

80 ఏళ్ల వృద్ధురాలిని వ్యాక్సిన్‌ వేసుకోమని అడగగా వ్యాక్సిన్ వేస్తే ఉరి వేసుకుంటానంటూ మొండిగా వ్యవహరించింది. వైద్య సిబ్బందిని మీరు వెళ్లిపోండి.. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ వృద్ధురాలు తల బాదుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు టీకా వేయించుకోవాలంటే బయపడుతున్నారు. సూది మందంటే చిన్న పిల్లల్లా మారాం చేయడంతో కాస్త ఫన్నీగా అనిపించింది.

చదవండి : Vaccination: వ్యాక్సినేషన్ స్పీడప్‌కు కేంద్రం చర్యలు

కొందరు కరోనా టీకా వేయించుకోవటానికి భయపడుతున్నారు. మరికొందరు లేనిపోని అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపడంలేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఏమాత్రం వారి తీరులో మార్పు రావడం లేదు.

Related Articles

- Advertisement -

Latest Articles