Saturday, November 27, 2021

ప్రపంచ కప్ ఫైనల్స్ కు వంద శాతం అభిమానులు…


ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐ కే ఉన్న… ఇండియాలో కరోనా కారణంగా దానిని యూఏఈ లో జరుపుతుంది. అక్కడ కూడా అన్ని కరోనా నియమాల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు 70 శాతం సామర్థ్యంతోనే మ్యాచ్‌లను నిర్వహించారు. కానీ తాజాగా.. ఈ నవంబర్ 14న జరగనున్న టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కు వంద శాతం ప్రేక్షకులను అనుమతించారు. దాంతో ఫైనల్ మ్యాచ్ జరగనున్న దుబాయ్ స్టేడియం అభిమానులతో హౌస్​ఫుల్ కానుంది. ఈ విషయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అలాగే మన బీసీసీఐకి అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉన్న మొత్తం 25 వేల సీట్లు అభిమానులకు అందుబాటులో ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Latest Articles