Monday, December 6, 2021

‘తెలంగాణ దేవుడు’ సందేశాత్మ‌క చిత్రం..బ్ర‌హ్మానందం..


తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా తెలంగాణ దేవుడు చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాను జీషన్ ఉస్మానీ నిర్మించగా.. నందన్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు. కాగా ఇది ఓ సందేశాత్మక చిత్రమని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కొనియాడారు. ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర బృందానికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, సంగీతలు వారి నటనతో ప్రాణం పోశారని బ్రహ్మానందం కొనియాడారు. డైరెక్టర్ హరీశ్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సినిమాను తెరకెక్కించారని, సమర్థవంతమైన దర్శకుడని ప్రశంసించారు. తన పాత్ర కూడా సినిమాలో చాలా బాగుంటుందన్నారు. తనను కేవలం కామెడీకే పరిమితం చేయకుండా.. హీరో గురువైన మృత్యుంజయ శర్మ పాత్రను తనకిచ్చారని అన్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily



Related Articles

- Advertisement -

Latest Articles