Tuesday, December 7, 2021

Heavy rains on Tirumala hills : తిరుమల కొండపై భారీ వర్షాలు..తిరుమల-పాపవినాశనం రోడ్డు మూసివేత | Trirumala Papavinashanam road closed


తిరుమల కొండపై భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల-పాపవినాశనం రోడ్డును అధికారులు మూసివేశారు.

Trirumala Papavinashanam road closed : ఓ పక్క శీతాకాలం గాలులు వణికిస్తుంటే మరోపక్క భారీ వర్షాలు తిరుమల కొండను వణికిస్తున్నాయి. తీవ్రంగా గాలుల వీస్తుండటంతో భారీ వృక్షాలు కూలిపోయాయి. రోడ్లకు అడ్డంగా భారీ వృక్షాలు కూలిపోవటంతో తిరుమల అధికారులు రంగంలోకి దిగారు. వృక్షాలను నరికి కొమ్మలను తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుమలలో భారీగా కురుస్తున్న వర్షాలకు ముందస్తుగా అధికారులు తిరుమల నుంచి పాపవినాశనం వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు.

Read more : Chennai Rains : వణుకుతున్న తమిళనాడు.. తుఫాన్ కుమ్మేస్తోంది

కాగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుమల భారీ వర్షాలతో తడిసిముద్దవుతోంది. తీవ్ర గాలుల ధాటికి కొండపై పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కుప్పకూలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి.

Read More : India Corona cases: బీ కేర్‌ఫుల్.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో తిరుమల-పాపవినాశనం రోడ్డును అధికారులు మూసేశారు. రోడ్లపై పడిన వృక్షాలు, కొమ్మలను అటవీ, టీటీడీ అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలను చేపట్టారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

 

Related Articles

- Advertisement -

Latest Articles