Wednesday, December 1, 2021

Today Horoscope : న‌వంబ‌ర్‌ 14 2021 ఆదివారం మీ రాశిఫ‌లాలు


మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని లాభాలు వస్తాయి. పెద్దల నుంచి పూర్తి స్తాయి సహకారం లభిస్తుంది. కుటుంబంలో విందులు, వినోదాలు. ఆఫీస్‌లో మంచి రోజు. విద్యార్థులకు శుభసమయం. వ్యాపారాలలో లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు పనులు వేగంగా పూర్తిచేస్తారు. విశ్రాంతి దొరుకుతుంది. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి వత్తిడి. వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థికంగా మంచి రోజు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు. విద్యార్థులకు మంచి సమయం బాగా శ్రమించి మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ కాలభైరవాష్టకం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూల వాతావరణం. పెద్దల మాటలు వినకపోవడం వల్ల నష్టపోతారు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు రావచ్చు. విద్యార్థులకు నిరుత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న సమస్యలు రావచ్చు. శ్రీ శివ అభిషేకం చేయండి.

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు సంతోషమైన రోజు. సమస్యలు తీరుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆఫీస్‌లో పనులలో ముందుకు సాగుతారు. కుటుంబంలో విభేదాలు తొలగుతాయి. విద్యార్థులకు సానుకూలత. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి ధన లాభాలు వస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. రియల్‌ ఎస్టేట్లలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు ఉత్సాహం లభిస్తుంది. శ్రీ సరస్వతి దేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పనులు నెమ్మదిస్తాయి. శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో ఇబ్బందులు. ధనం కోసం శ్రమించాల్సిన రోజు. విద్యార్థుల శ్రమకు తగ్గ ఫలితం రాదు. గోసేవ చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. ధనం కోసం కష్టపడుతారు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. దేవాలయం దర్శనం చేస్తారు. వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. విద్యార్థులకు ఇబ్బందులు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు కార్యజయం. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. పెద్దల నుంచి అహ్వానాలు లభిస్తాయి. ధన లాభాలు వస్తాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ప్రతికూలతల మధ్య ఈరోజు కొనసాగుతుంది. చేసే పనులలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. రుణ ప్రయత్నాలు. బంధువుల నుంచి నిరాదరణ. విద్యార్థులకు వత్తిడి. శ్రీశివాభిషేకం చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు , వ్యాపారులకు లాభదాయకమైన రోజు. కొత్తప నులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆఫీస్‌లోమంచి పేరు వస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శ్రీగణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : శ్రమతో కూడిన రోజు. ఆస్తి కోసం సోదరుల మధ్య విభేదాలు రావచ్చు. అనుకోని బంధువులు లేదా స్నేహితులను కలవడం లేదా మాట్లాడం చేస్తారు. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు. విద్యార్థులు శ్రమించి ఫలితం పొందుతారు. శ్రీ విష్ణుసహస్రనామాలను పారాయణం చేయండి.

The post Today Horoscope : న‌వంబ‌ర్‌ 14 2021 ఆదివారం మీ రాశిఫ‌లాలు first appeared on The Telugu News.

Related Articles

- Advertisement -

Latest Articles