Wednesday, December 1, 2021

గ‌నికి ‘రామ్ చ‌ర‌ణ్’ వాయిస్..టీజ‌ర్ రిలీజ్..


కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ష‌న్ లో గ‌ని చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో హీరోగా వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్నాడు. . అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది.ఈ టీజర్ కి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ చెప్ప‌డం విశేషం.

ఆయన వాయిస్ ఓవర్ పై వరుణ్ తేజ్ బాక్సింగ్ విజువల్స్ ను కట్ చేశారు. చరణ్ వాయిస్ ఓవర్ వలన టీజర్ చాలా కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. “ప్రతి ఒక్కరి కథలో కష్టాలు .. కన్నీళ్లు ఉంటాయి. కోరికలుంటాయి .. కోపాలుంటాయి. కలబడితే గొడవలుంటాయి. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అయిపోవాలనే ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడివి నువ్వే ఎందుకవ్వాలి.. ఆట ఆడినా .. ఓడినా కూడా రికార్డ్స్ లో ఉంటావు .. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావు” అంటూ చరణ్ వాయిస్ ఓవర్ కొనసాగింది.

Related Articles

- Advertisement -

Latest Articles