Sunday, November 28, 2021

సినిమాపై హైప్ క్రియేట్ చేసిన రాధేశ్యామ్ సాంగ్ ప్రోమో..


యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ .. పూజ హెగ్డే జంటగా న‌టిస్తోన్న చిత్రం రాధేశ్యామ్. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు.. టి – సిరీస్ .. యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం వలన, పాటలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో నీ రాత‌లే అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈప్రోమోతో ఈ సినిమాపై మ‌రింత హైప్ ని క్రియేట్ చేశారు. హీరోయిన్ చేయిని అందుకోవాల‌ని హీరో చేసే ప్ర‌య‌త్నాని ఈ ప్రోమోలో చూపించారు. మ‌రి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోన‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఇప్ప‌టినుంచే ఊహించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles