Monday, December 6, 2021

అద‌ర‌గొడుతోన్న ఏ బిడ్డా.. ఇది నా.. అడ్డా సాంగ్ ప్రోమో..


పుష్ప చిత్రం నుండి ఏ బిడ్డా ఇది నా అడ్డా అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్ర బృందం..ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు సుకుమార్..కాగా అల్లు అర్జున్, ర‌ష్మిక‌మంద‌న ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇక ఈ సాంగ్ ప్రోమోలో వందల మంది డాన్సర్ల మధ్య పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో మాస్‌ సాంగ్‌కి డాన్సు వేస్తున్నాడు బ‌న్నీ. పండుగ సందర్భంగా జాతరలో డాన్స్ చేస్తున్న సాంగ్‌ ప్రోమో బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ పాట ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ పాటని విడుదల చేశారు. హిందీలోనూ ఈ రాత్రి రిలీజ్‌ చేయబోతున్నారు. ఇక ఈ పూర్తి పాటని ఈ నెల 19న ఉదయం 11.07గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ పాటకి చంద్రబోస్‌ లిరిక్‌ రాయగా, నకాష్‌ అజిజ్‌ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 17న ఐదు భాషల్లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Latest Articles