Friday, December 3, 2021

కుంబ్లే స్థానంలో ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా గంగూలీ…!


బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా నియమిస్తున్నట్లు తాజాగా ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్కే ప్రకటించారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా… నిర్వాహకుడిగా తనకు ఉన్న అనుభవం ముందుకు వెళ్లడంలో మాకు సహాయపడుతుంది అని బార్కే ప్రకటించాడు. అయితే ఇంతకు ముందు వరకు ఈ పదవిలో భారత మాజీ స్పిన్నర్… గంగూలీ స్నేహితుడు అనిల్ కుంబ్లే ఉన్నాడు. ఇక గత తొమ్మిదేళ్లుగా ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా ఉండి అంతర్జాతీయ క్రికెట్ ను మెరుగుపరిచిన అనిల్‌కు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు గ్రెగ్ బార్కే అన్నారు. అయితే భారత జట్టు రూపు రేఖలను మార్చిన కెప్టెన్ గా పేరున్న దాదా… 2019 వరకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా… ఆ తర్వాత 2019 అక్టోబర్ లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.

Related Articles

- Advertisement -

Latest Articles