Monday, November 29, 2021

Paddy Procurement : మోదీకి సీఎం కేసీఆర్ లేఖ…ధాన్యం కొనుగోళ్లు చేయాలని విజ్ఞప్తి | Telangana CM KCR Letter To PM Modi Paddy Procurement Issue


Telangana CM KCR : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిగా ధాన్యం ఎంతకొంటారో చెప్పడం లేదని, వరిసాగు విస్తీర్ణం పెరుగుతున్నా కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదన్నారు. యాసంగిలో ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై FCIకి ఆదేశాలు ఇవ్వాలని, 2020-21 యాసంగి సీజన్ కు సంబంధించిన..5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.

Read More : Month Salary : నెల తిరగకుండానే..జీతం అయిపోతోంది..సర్వేలో ఆసక్తికర విషయాలు

ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నా..కొనుగోళ్ళు పెరగడం లేదనే అంశాన్ని ప్రస్తావించారు. ఎఫ్ సీఐ విధానంతో పంటల విధానాన్ని వివరించలేకపోతున్నట్లు, 2021 యాసంగిలో 55.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని వివరించారు. అందులో 32.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్ సీఐ సేకరించిందని తెలిపారు. 2021 యాసంగిలో 59 శాతం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. ధాన్యం సేకరణలో వ్యత్యాసాలతో పంట విధానాలను అమలు చేయండం ఇబ్బందిగా మారిందని లేఖలో వెల్లడించారు.

The post Paddy Procurement : మోదీకి సీఎం కేసీఆర్ లేఖ…ధాన్యం కొనుగోళ్లు చేయాలని విజ్ఞప్తి appeared first on 10TV.

Related Articles

- Advertisement -

Latest Articles