Wednesday, December 1, 2021

Vijayawada : కోటి దీపాలతో వెలిగిపోనున్న ఇంద్రకీలాద్రి.. koti deepotsavam on Inadrakeeladri Kanakadurga temple


కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి; పర్వతం కోటి దీపాలతో తేజోమానంగా వెలిగిపోనుంది. కోటి దీపోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Koti Deepotsavam on Vijayawada Indrakeeladri : అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దీపాల వెలుగులతో తేజోమానంగా వెలిగిపోనుంది. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నవంబర్ 18న సాయంత్రం 6 గంటలకు నిర్వహించే కోటి దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ సందర్భంగా ఈవో భ్రమరాంబ మాట్లాడుతు.. దాతలు ఉత్సవానికి అవసరమైన నువ్వుల నూనె, కోటి వత్తులు, అఖండ దీపానికి అవసరమైన వత్తులు అందజేశారని తెలియజేశారు.

Read more : Laksha Kumkuma Archana : తిరుచానూరులో ఈనెల 29న పద్మావతి అమ్మవారికి ల‌క్ష‌ కుంకుమార్చ‌న

దీపోత్సవానికి విశాఖ శారదాపీఠం వ్యవస్థాపకులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకొని నవంబర్ 19న నిర్వహించే 8 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ట్రస్టు బోర్డు ఆమోదించిందన్నారు. గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను అలంకరించిన ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేశామన్నారు.

Read more : Pournami Garuda Seva : న‌వంబ‌రు 19న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

గిరి ప్రదక్షణకు రెండున్నర గంటల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. గిరి ప్రదక్షిణలో దేవస్థాన ప్రచార రథంతో పాటు నడవలేని వారికి మినీ బస్సులు ఏర్పాటు చేస్తామని..ప్రదక్షిణ చేసే భక్తుల కోసం మెడికల్ క్యాంపు, ఉచిత ప్రసాదం, ఆంబులెన్స్‌లు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయనున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గిరి ప్రదర్శన చేయవలసిందిగా ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Articles

- Advertisement -

Latest Articles