Friday, December 3, 2021

TRS Maha Darna : మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సండ్ర వెంకట వీరయ్య | trs mahadarna mla sandra venkata veeraiah Special attraction


వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఇందిరాపార్క్ వద్ద ఉదయం 11 గంటలకు ఈ మహాధర్నా కార్యక్రమం ప్రారంభమైంది.

TRS Maha Darna : వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఇందిరాపార్క్ వద్ద ఉదయం 11 గంటలకు ఈ మహాధర్నా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ధర్నాలో సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ మ‌హాధ‌ర్నాలో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. త‌న శ‌రీరంపై వ‌డ్ల కంకుల‌తో అలంక‌ర‌ణ చేసుకున్నారు.

చదవండి : KCR Maha Dharna : కేంద్రంపై టీఆర్ఎస్ వార్… సీఎం కేసీఆర్ మహా ధర్నా – Live Updates

భుజంపై నాగ‌లి పెట్టుకుని.. వ‌డ్ల కంకుల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేశారు.ఇక ఈ ధ‌ర్నాలో కేంద్రం వైఖ‌రిపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుబంధు స‌మితి అధ్య‌క్షులు, రైతులు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. మ‌హాధ‌ర్నా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

చదవండి : Maha Dharna: కేంద్రంపై యుద్ధం.. ఇందిరాపార్క్‌లో టీఆర్‌ఎస్‌ మహా ధర్నా నేడే!

Related Articles

- Advertisement -

Latest Articles