Friday, December 3, 2021

CM Jagan : బాబు ఉంటే బాగుండేది, ఆయనకు ఏం కష్టం వచ్చిందో.. అసెంబ్లీలో సీఎం జగన్ సెటైర్లు | CM Jagan Satires On Chandrababu In AP Assembly


ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు.

CM Jagan : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారత అంశంపై సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల సర్వతోముఖాభివృద్ధిని ఓ ఉద్యమంలా భావించి అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ రెండున్నరేళ్ల కాలం మహిళా సాధికారత అంశం పరంగా ఓ సువర్ణ అధ్యాయం అని తెలిపారు. ఈ సందర్భంగా విపక్షనేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు జగన్.

చంద్రబాబు బీఏసీ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని జగన్ నిలదీశారు. చంద్రబాబు వస్తారేమోనని బీఏసీ సమావేశాన్ని కొంచెం సేపు ఆలస్యం చేశామని, అయినప్పటికీ ఆయన రాలేదని తెలిపారు. ఆయనకు ఏ కష్టం వచ్చిందో తనకైతే తెలియదని సెటైర్ వేశారు. అయితే ‘చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడిందని మావాళ్లు అంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. కాగా, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. చంద్రబాబు కంచుకోటలో వైసీపీ పాగా వేసింది. కుప్పం మున్సిపాలిటీని అధికార పార్టీ కైవసం చేసుకుంది.

Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క

ఈ చర్చలో చంద్రబాబు కూడా ఉంటే బాగుండేదని జగన్ అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు మంచి జరగాలని భావిస్తున్న ప్రభుత్వం తమదన్నారు. కోటి మంది మహిళలకు సున్నా వడ్డీ పథకం ఇచ్చామని తెలిపారు. మహిళలకు ఆక్సిజన్‌గా వైఎస్ఆర్ ఆసరా పథకం అమలు చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అక్కచెల్లెమ్మలకు అమ్మఒడి నిధులు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు.

ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో సభ ప్రారంభం కాగా.. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించగా.. ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఏసీలో ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. చంద్రబాబును సభకు తీసుకురండి.. కుప్పం ఫలితాల తర్వాత ఆయన మొహం చూడాలని ఉందని అచ్చెన్నాయుడితో సీఎం జగన్ అన్నట్లు తెలుస్తోంది.

Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ

గెలుపోటములు సర్వ సాధారణం.. చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారని సీఎంకు అచ్చెన్న బదులిచ్చారు. ఈ సమయంలో మంత్రి అనిల్ కల్పించుకుంటూ.. నెల్లూరులో అచ్చెన్న ఇంచార్జిగా ఉన్నారన్నారు. దీంతో అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. బీఏసీలో ఎన్నికల ప్రస్తావన దేనికి..? ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసంటూ అధికార పక్షానికి ఘాటుగా బదులిచ్చారు. సభకు చంద్రబాబు వచ్చేలా చూడాలని ఒకటికి రెండు సార్లు అచ్చెన్న దగ్గర ప్రస్తావించిన జగన్.. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయన్నారు. దీనికి అచ్చెన్న స్పందిస్తూ.. కుప్పంలో ఎలా గెలిచారో మీకూ తెలుసు.. మాకూ తెలుసని బదులిచ్చారు.

 

Related Articles

- Advertisement -

Latest Articles