Monday, December 6, 2021

Maha Dharna : రైతన్న కోసం..రాజ్ భవన్‌‌కు టీఆర్ఎస్ ర్యాలీ, పాల్గొననున్న సీఎం కేసీఆర్ | TRS rally at Raj Bhavan Maha Dharna In Indira Park


రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ ఆందోళనలు, ధర్నాలు చేసిన సందర్భాలు చాలా అరుదు. ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు నిరసనగా 2014లో రాష్ట్ర బంద్ చేపట్టింది.

TRS Rally At Raj Bhavan : సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్‌ను కలవబోతున్నారు. రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లనున్న కేసీఆర్‌… అక్కడ గవర్నర్‌ను కలిసి మెమొరాండం సమర్పిస్తారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, ఖైరతాబాద్‌ మీదుగా రాజ్‌భవన్‌కు కేసీఆర్‌ సహా టీఆర్‌ఎస్‌ నేతలు వెళ్తారని తెలుస్తోంది. వరి కొనుగోళ్లపై కేంద్రంతో సమరానికి సై అంటూ టీఆర్‌ఎస్‌ చేపట్టిన మహా ధర్నా ఇందిరాపార్క్ లో కొనసాగుతోంది. ఈ ధర్నాకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని తేల్చి చెప్పారు. మన హక్కులు సాధించే వరకు, రైతులకు న్యాయం జరిగే తమ పోరాటం ఆగదు.. అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. దీంతో కేంద్రంపై పోరుకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కేంద్రం ద్వంద్వ విధానాలకు నిరసనగా, తెలంగాణ రైతాంగానికి మద్దతుగా ధర్నా చేపట్టామని కేసీఆర్ అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణకు.. కేంద్రం విధానాలతో దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఇది ఇక్కడితో ఆగిపోయే యుద్ధం కాదని.. ఉత్తర భారత రైతాంగంతో కలిసి పోరాడతామన్నారు కేసీఆర్.

Read More : TRS Maha Darna : మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సండ్ర వెంకట వీరయ్య

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ ఆందోళనలు, ధర్నాలు చేసిన సందర్భాలు చాలా అరుదు. ఏడు మండలాలను ఏపీలో కలిపినందుకు నిరసనగా 2014లో రాష్ట్ర బంద్ చేపట్టింది. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 2019లో మహబూబ్‌నగర్‌ జిల్లా బూర్గుల వద్ద కేటీఆర్ నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇంత భారీఎత్తున నిరసనలు చేపడుతోంది గులాబీ సేన. 2021, నవంబర్ 17వ తేదీ బుధవారం ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని కోరారు.

Read More : KCR Maha Dharna : కాసేపట్లో కేసీఆర్ ర్యాలీ.. మ.3గంటలకు గవర్నర్‌కు ఫిర్యాదు – Live Updates

2020-21 ఎండాకాలం సీజన్లో సేకరించకుండా వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్న నిబంధన మరింతగా పెంచి… పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా వానాకాలం పంటలో 90శాతం వరిని సేకరించాలన్నారు. వచ్చే యాసంగిలో తెలంగాణ నుంచి కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్ధారించాలని లేఖలో కోరారు. ఈనెల 12న నియోజకవర్గాల కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ ధర్నాలు కూడా నిర్వహించింది. 50 రోజులు దాటినా.. కేంద్రం నుంచి స్పష్టత కరువైందని కేసీఆర్‌ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా ధర్నా తర్వాత కేంద్రం నుంచి స్పందన కోసం రెండ్రోజులు ఎదురు చూస్తామని.. అప్పటికీ కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేకపోతే బీజేపీని వెంటాడుతూనే ఉంటామని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ మహా ధర్నా తర్వాత కేంద్రం స్పందిస్తుందా, లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పెద్దల నుంచి రెస్పాన్స్‌ లేకపోతే.. టీఆర్‌ఎస్‌ పోరాటం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఏర్పడింది.

Related Articles

- Advertisement -

Latest Articles