Thursday, December 2, 2021

KCR Maha Dharna : కాసేపట్లో కేసీఆర్ ర్యాలీ.. మ.3గంటలకు గవర్నర్‌కు ఫిర్యాదు – Live Updates | KCR Maha Dharna at indira park against paddy procurement policies of modi government live updates


యాసంగి వరి కొనుగోలు, ధాన్యం సేకరణ అంశాల్లో కేంద్రం పాలసీలకు నిరసనగా తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నాకు పిలుపునిచ్చారు.

KCR Maha Dharna : యాసంగి వరి కొనుగోలు, ధాన్యం సేకరణ అంశాల్లో కేంద్రం పాలసీలకు నిరసనగా తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు.. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

  • నల్గొండ జిల్లా రైతులకు బీజేపీపై కోపం వచ్చిందన్న జగదీశ్ రెడ్డి

  • రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్లనున్న సీఎం

    ఇందిరాపార్క్ నుంచి రాజ్ భవన్ వరకు సీఎం కేసీఆర్ ర్యాలీగా వెళ్లనున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ మీదుగా రాజ్ భవన్ కు చేరుకుంటారు సీఎం. కేసీఆర్ పాల్గొనబోయే ఈ రోడ్ ర్యాలీలో టీఆర్ఎస్ మంత్రులు, కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. 3 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని కలిసి.. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు విధానాలపై నిరసన తెలిపి.. ఫిర్యాదు సమర్పిస్తారు.

  • మ.3 గంటలకు రాజ్ భవన్ కు సీఎం

    మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ కు వినతి ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు.

  • కేసీఆర్ కు యావత్ తెలంగాణ రైతాంగం మద్దతు ఇవ్వాలి | MLA Sandra Venkata Veeraiah

  • ఇది ఆరంభం మాత్రమే – కేసీఆర్ స్పీచ్

  • ధర్నా చౌక్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

    ఇందిరాపార్క్ దగ్గర టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహా ధర్నాకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మంత్రులు, నేతలు, కార్యకర్తలు.. ఈ ధర్నాలో పచ్చ కండువాలు ధరించి హాజరయ్యారు.

Related Articles

- Advertisement -

Latest Articles