Thursday, December 2, 2021

పుష్ప ఫోర్త్ సింగిల్ లిరికల్ సాంగ్ రిలీజ్..


ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా… అంటూ సాగే ఫోర్త్ సింగిల్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.. ఇప్పటివరకు రిలీజైన మూడు పాటల్లాగే ఈ సాంగ్ కూడా మాస్ ఆడియెన్స్‌ని మాయ చేస్తోంది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ప్రోమో రిలీజైన గంట వ్యవధిలోనే ఈ వీడియోకు దాదాపు మిలియన్ వ్యూస్ మార్క్ టచ్ చేసే దిశగా పరుగులు తీసింది. ఫోర్త్ సింగిల్ ప్రోమోకే ఇంత భారీ రెస్పాన్స్ కనిపిస్తుందంటే.. సాంగ్ కి ఎంత‌టి ఆద‌ర‌ణ ల‌భిస్తుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily



Related Articles

- Advertisement -

Latest Articles