Sunday, November 28, 2021

Balakrishna Live : ఖబడ్దార్ వైసీపీ నేతల్లారా! బావ కన్నీళ్లపై బాలయ్య ఫైర్- Live Updates | Balakrishna Press meet on Chandrababu Crying Live


LIVE NOW

Balakrishna Press meet on Chandrababu Crying Live

 • పాపిష్టి, భూయిష్టి మాటలు మాట్లాడితే ఖబడ్దార్

  వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టుగా.. ప్రతిపక్ష నేతలపై పాపిష్టి, భూయిష్టి మాటలు మాట్లాడితే తాము ఇక చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు బాలకృష్ణ. అధికార పార్టీ నేతలు జాగ్రత్తగా, మర్యాదగా ఉండాలి హెచ్చరించారు. మళ్లీ ఇలాంటివి రిపీటైతే.. ఏది అడ్డం పెట్టుకున్నా ..ఏ వ్యవస్థలనైనా బద్దలు కొట్టుకుని గుణపాఠం చెబుతామన్నారు.

 • వైసీపీని విమర్శించడానికి ఇక మాకు చంద్రబాబు అనుమతి అవసరం లేదు

  వైసీపీని విమర్శించడానికి ఇక మాకు చంద్రబాబు అనుమతి అవసరం లేదని విమర్శకులను హెచ్చరించారు బాలకృష్ణ. ఇన్నాళ్లు ఆయన చెప్పడం వల్లే తాము ఆగామన్నారు.

 • చంద్రబాబు కన్నీళ్లు ఎన్నడూ చూడలేదు

  చంద్రబాబు కంటతడి పెట్టడం తాను ఎన్నడూ చూడలేదన్నారు బాలకృష్ణ. అధికారం ఉంది కదా అని వైసీపీ విర్రవీగి మాట్లాడితే సహించేది లేదన్నారు.

 • వైసీపీ తీరును ఉపేక్షించేది లేదు

  వైసీపీ మైండ్ గేమ్ ప్లే చేస్తోంది. పదవులు, అధికారం ఏదీ శాశ్వతం కాదన్నారు బాలకృష్ణ. ఆడవారిపైనా, రాజకీయాలకు సంబంధం లేనివాళ్లపైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే జనం ఊరుకోరన్నారు.

 • అసెంబ్లీ ఇష్యూ బేస్డ్ గా జరగాలి

  బావ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడంపై హైదరాబాద్ లోని తన నివాసంలో స్పందించారు ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యుడు బాలకృష్ణ. అసెంబ్లీ ఇష్యూ బేస్డ్ గా జరగాలన్నారు బాలయ్య.

Related Articles

- Advertisement -

Latest Articles