Wednesday, December 1, 2021

బంగార్రాజు ఫ‌స్ట్ లుక్..ఎప్పుడో తెలుసా..


సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా హీరో నాగ‌చైత‌న్య ఓ కీల‌క పాత్ర‌లో మెర‌వ‌నున్నాడు. కాగా నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. నవంబర్‌ 23 వ తేదీన అక్కినేని నాగ చైతన్య బర్త్‌ డే. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. నవంబర్‌ 22 వ తేదీన సాయంత్రం 5.22 గంటలకు బంగార్రాజు ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేస్తునట్లు ప్రకటించింది చిత్ర బృందం. అంతేకాదు… నాగచైతన్య పుట్టిన రోజున అంటే నవంబర్‌ 23 న ఉదయం 10.23 గంటలకు ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Related Articles

- Advertisement -

Latest Articles