Friday, December 3, 2021

Telangana : రాష్ట్ర ఖజానాకు మద్యం కిక్కు.. వైన్స్ అప్లికేషన్లతో రూ.1,357 కోట్ల ఆదాయం | telangana excise deportment conduct wine shops Auction


తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల కేటాయింపు కోసం దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసిన నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ద్వారా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు రూ.1,357 కోట్ల ఆదాయం వచ్చింది.

Telangana : తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల కేటాయింపు కోసం దరఖాస్తుదారుల నుంచి వసూలు చేసిన నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు ద్వారా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు రూ.1,357 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు 67,849 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి సగటున 26 దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత జిల్లా కలెక్టర్‌ సమక్షంలో శనివారం లాట్‌ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయిస్తారు.

చదవండి : Telangana : బాయిల్డ్ రైస్ కొనం…ఎందుకో కారణాలు చెప్పిన కేంద్రం

ఇతర జిల్లాలతో పోలిస్తే ఖమ్మం, నల్గొండ ఎక్సైజ్ జిల్లాల్లోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మంలో 122 నోటిఫైడ్ షాపులకు 6,084 దరఖాస్తులు రాగా, నల్గొండ జిల్లాలో 155 దుకాణాలకు 4,027 దరఖాస్తులు వచ్చాయి. ఇక హైదరాబాద్‌లో 80 దుకాణాలకు గాను 1,503 దరఖాస్తులు రాగా, సికింద్రాబాద్‌లో 99 దుకాణాలకు 1,519 దరఖాస్తులు వచ్చాయి. సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ జిల్లాలో 134 దుకాణాలకు 4,102 దరఖాస్తులు వచ్చాయి.

చదవండి : Telangana : 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

మీర్‌పేట్‌లోని ఒక దుకాణానికి 55 దరఖాస్తులు వచ్చాయి, ఇది సరూర్‌నగర్ ఎక్సైజ్ జిల్లాలో అత్యధికంగా ఉండగా, మన్సూరాబాద్‌లోని మరో దుకాణానికి 14 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి, ఇది అత్యల్పంగా ఉంది. కొన్ని దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడానికి గల కారణాలను కూడా ఆ శాఖ ఆరా తీస్తోంది.

చదవండి : Telangana : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం

శుక్రవారం ఇక్కడి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో లాట్‌ డ్రా సజావుగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, దరఖాస్తుదారులను ఎంట్రీ పాస్‌తోనే స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు. దరఖాస్తుదారులందరూ ఉదయం 11 గంటల నుండి స్టేడియంలో లాట్ డ్రాకు హాజరైనప్పుడు కోవిడ్ భద్రతా ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలి అని ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Latest Articles