Monday, December 6, 2021

Chandrababu: నా అక్కను తిడితే తాట తీస్తాం – బాలకృష్ణ | Nandamuri family press meet on Chandrababu Tears


బావ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడంపై హైదరాబాద్ లోని తన నివాసంలో స్పందించారు ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యుడు బాలకృష్ణ. అసెంబ్లీ ఇష్యూ బేస్డ్ గా జరగాలన్నారు బాలయ్య.

Chandrababu: బావ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడంపై హైదరాబాద్ లోని తన నివాసంలో స్పందించారు ఎమ్మెల్యే, ఆయన కుటుంబసభ్యుడు బాలకృష్ణ. అసెంబ్లీ ఇష్యూ బేస్డ్ గా జరగాలన్నారు బాలయ్య.

వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టుగా.. ప్రతిపక్ష నేతలపై పాపిష్టి, భూయిష్టి మాటలు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు బాలకృష్ణ. అధికార పార్టీ నేతలు జాగ్రత్తగా, మర్యాదగా ఉండాలని హెచ్చరించారు. మళ్లీ ఇలాంటివి రిపీటైతే.. ఏది అడ్డం పెట్టుకున్నా ..ఏ వ్యవస్థలనైనా బద్దలు కొట్టుకుని గుణపాఠం చెబుతామన్నారు.

వైసీపీని విమర్శించడానికి చంద్రబాబు అనుమతి అవసరం లేదని హెచ్చరించారు బాలకృష్ణ. ఇన్నాళ్లు ఆయన చెప్పడం వల్లే ఆగామన్నారు. చంద్రబాబు కంటతడి పెట్టడం ఎన్నడూ చూడలేదన్నారు. అధికారం ఉంది కదా అని విర్రవీగి మాట్లాడితే సహించేది లేదన్నారు.

వైసీపీ మైండ్ గేమ్ ప్లే చేస్తోంది. పదవులు, అధికారం ఏదీ శాశ్వతం కాదన్నారు. ఆడవారిపైనా, రాజకీయాలకు సంబంధం లేనివాళ్లపైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే జనం ఊరుకోరన్నారు.

………………………………….. : రాజమౌళి సినిమాకి సల్మాన్ సపోర్ట్..

భువనేశ్వరీ అక్క లోకేశ్వరీ:

నారా భువనేశ్వరీ అక్కడ లోకేశ్వరీ మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి పెద్ద మనిషి విలపిస్తుంటే చూడలేకపోయా. నా చెల్లెల్ని అవమానించారు. ఆయన హయాంలో షర్మిళను కానీ, విజయమ్మను కానీ ఒక్క మాట కూడా అనలేదు. మళ్లీ ఇలాంటివి రిపీట్ అవకూడదని కోరుకుంటున్నాం’ అని వివరించారు.

చైతన్య కృష్ణ
తెలుగు ఆడపడుచు విలువలు నేర్పించారు మా తాతగారు. నాయనమ్మ బసవతారకం గారు చాలా మంచి విలువలు నేర్పించారు. సింపుల్ గా ఉండటంతో పాటు అభిమానంతో పలకరిస్తారు. అత్త భువనేశ్వరీ గారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. తాతగారు తీసిన సినిమా కోడలు దిద్దిన కాపురం సినిమాలో కూడా మహిళలకు విలువ ఇచ్చేది కనిపిస్తుంది.

………………………………….: ఫేక్ చికెన్ కోసం నెస్లే రూ.30 కోట్ల పెట్టుబడి

ఆడాళ్లను కించపరుస్తూ మాట్లాడతారా.. సిగ్గు.. ఉండక్కర్లేదా.. ఆస్తిలో సమానహక్కు కల్పించినట్లే, రాజకీయాల్లో కూడా హక్కు కల్పించాలి. వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు వీళ్లంతా నీచాతినీచంగా మాట్లాడారు. ఇది చాలా తప్పు. మీ నుంచి మా కుటుంబం బర్తరఫ్ చేయాలంటూ స్టేట్మెంట్ కోరతున్నాం. మీరు కూడా క్షమాపణ చెప్పాలి.

లోకేశ్వరి కుమారుడు శ్రీనివాస్

ఆడాళ్లను కించపరుస్తూ మాట్లాడడం సబబు కాదు. సభలో లేని వాళ్ల గురించి మాట్లాడారు. మీ పార్టీలోనూ ఆడాళ్లు ఉన్నారు. వారికి కుటుంబాలు ఉన్నాయి. ఇలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు.

……………………………………. : ‘బంగార్రాజు’ సినిమాలో చిట్టి స్పెషల్ సాంగ్??

 

Related Articles

- Advertisement -

Latest Articles