Sunday, December 5, 2021

ర‌కుల్ ప్రీత్ సింగ్ అపార్ట్ మెంట్ లో అగ్నిప్ర‌మాదం..


హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఉంటోన్న అపార్ట్ మెంట్ లోని 12వ అంత‌స్తులో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.షూటింగ్ నిమిత్తం రకుల్ ప్రస్తుతం లక్నోలో ఉన్నారు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది.

Related Articles

- Advertisement -

Latest Articles