Monday, December 6, 2021

Rashmi Gautam : రష్మీని అంత మాటనేసిన రాజ్ తరుణ్.. వయసును గుర్తు చేశాడా? | The Telugu News


Rashmi Gautam : యాంకర్ రష్మీ వయసు గురించి అందరికీ తెలిసిందే. మూడు పదులు ఎప్పుడో దాటేసింది. 35 వరకు వయసు ఉంటుంది. అలాంటి రష్మీ ఇంకా ఫిట్నస్ మెయింటైన్ చేస్తోంది. ఇంకా కొత్తగా వస్తోన్న యాంకర్లకు ధీటుగా ఉంటోంది. రష్మీ, అనసూయ ఇంచు మించు ఒకే వయసులోఉంటారు. అయితే తాజాగా రష్మీని రాజ్ తరుణ్ దారుణంగా అనేశాడు. ఆమె వయసును పరోక్షంగా గుర్తు చేస్తూ తనకంటే రాజ్ తరుణ్ ఎంత చిన్న వాడో అనేట్టుగా చూపించాడు.

రాజ్ తరుణ్ కశిష్ ఖాన్ జంటగా రాబోతోన్న అనుభవించు రాజా వచ్చే శుక్రవారం విడుదల కానుంది. అందుకోసం ఈ టీం ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో గెస్టుగా వచ్చింది. రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, డైరెక్టర్ శ్రీను ఇలా అందరూ జబర్దస్త్ షోలో సందడి చేశారు. అయితే చివర్లో రాజ్ తరుణ్ స్కిట్లో ఎంట్రీ ఇచ్చాడో ఏమో గానీ.. హీరోయిన్‌కు ప్రపోజల్ చేశాడు. హీరోయిన్ కాళ్ల ముందు పడిపోయి.. ఐ లవ్యూ అని చెప్పాడు. కానీ ఎంతకీ ఆమె ఏమీ చెప్పదు.

Raj Tarun Onn Rashmi Gautam In Extra Jabardasth

Rashmi Gautam : రష్మీని ఆంటి అనేసిన రాజ్ తరుణ్

కాళ్లు పట్టుకునే వరకు వెళ్తాడు రాజ్ తరుణ్. అయితే ఇటు సైడ్ ట్రై చేయ్ అని రోజా చెబుతుంది. దీంతో రష్మికి ప్రపోజ్ చేసేందుకు రాజ్ తరుణ్ రెడీ అవుతాడు. రష్మీ తెగ సిగ్గుపడుతుంది. అయితే ఒక్కసారిగా ఆంటీ అనేస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. సారీ అని చెప్పేస్తాడు. కానీ అది నిజమేననిపిస్తుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ రష్మీ ముందు చాలా చిన్నవాడు అవుతాడు. పైగా రష్మీ ఏజ్ గురించి ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Latest Articles