Friday, December 3, 2021

Rayala Pond : రాయల చెరువు నుంచి లీకవుతున్న నీరు..కట్ట తెగితే 100 గ్రామాలకు ముప్పు | Water leakage from Rayala pond, threat to 100 villages if the dam breaks


చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలానికి పెనుముప్పు పొంచి వుంది. రాయల చెరువు కట్టకు గండి పడటంతో వరద నీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి కొద్దికొద్దిగా జారుతోంది.

Water leakage from Rayala pond : చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలానికి పెనుముప్పు పొంచి వుంది. రాయల చెరువు కట్టకు గండి పడటంతో వరద నీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి కొద్దికొద్దిగా జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు సమీప ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఒకవేళ రాయల చెరువు తెగితే సుమారు వంద పల్లెలకు ముంపు ప్రమాదం పొంచి వుందని అధికారులు చెప్తున్నారు.

రాయల చెరువు దిగువన పల్లెల్ని అధికారులు అప్రమత్తం చేశారు. అంతేగాక రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరు, గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరు, వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో ప్రజల్ని అప్రమత్తం చేశారు.
Trains Canceled : ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు

పల్లెలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్‌తో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అక్కడే పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles