Wednesday, December 1, 2021

Amaravathi : రాజధాని అంశంపై సీఎం జగన్ సంచలన ప్రకటన..మళ్లీ బిల్లు తీసుకొస్తాం | AP CM Jagan Announced AP Capital Amaravathi


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన బిల్లును మళ్లీ అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

AP Capital Amaravathi : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన బిల్లును మళ్లీ అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారు. 2021, నవంబర్ 22వ తేదీ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో మూడు రాజధానులు తీసుకొచ్చామో…ఆర్థిక మంత్రి బుగ్గన వివరించడం జరిగిందని, ఈ ప్రాంతమంటే తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, తనకు ప్రేమ ఉందన్నారు. ఈ ప్రాంతంలోనే తనకు ఇల్లు ఉందని, రాజధానిలో రోడ్లు డెవలప్ చేయాడానికి డబ్బులు లేవని, అభివృద్ధి చేయాలంటే..ఎకరాకు రూ. 2 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు చెప్పారాయన.

Read More : Taliban Govt : మీడియాకు తాలిబన్ల హుకూం..మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దు..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందే

50 వేల ఎకరాలకు రూ. లక్ష కోట్లు అవసరం ఉంటుందని..ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తామని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరగాలన్నదే తన తాపత్రయమని, రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ అని..విశాఖలో అన్ని సదుపాయాలున్నాయని తెలిపారు. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ వంటి నగరంతో విశాఖ పోటీపడే పరిస్థితి వస్తుందన్నారు. విస్తృతమైన.. విశాలమైన రీతిలో ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకే 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని సీఎం జగన్ చెప్పారు. మరింత మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు కొత్త బిల్లును తీసుకువస్తామని స్పష్టం చేశారు.

Read More : Koil Alwar Thirumanjanam : తిరుచానూరులో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

జగన్ ఏం చెప్పారంటే…
‘రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే, ఈ రోజుకు దాని నుంచి మంచి ఫలితాలు ఈ పాటికే అందుబాటులోకి వచ్చేవి. నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక స్పూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టటం జరిగింది. గతంలో కేంద్రీకరణ ధోరణలు, వీటిని ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమయింది. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం.

Read More : Kerala : బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారమే..కేరళ హైకోర్టు కీలక తీర్పు

అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు… వీరందరి ఆశలూ ఆకాంక్షలూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే, ప్రభుత్వానికి గడిచిన ఈ రెండున్నరేళ్ళలో జరిగిన ఏ ఎన్నికల్ని తీసుకున్నా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు. అయితే, వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు.. ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కనపెట్టి, కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా కళ్లతో చూశాం.

Read More : AP Three Capitals : ఇప్పటికీ 3 రాజధానులకే కట్టుబడి ఉన్నా : మంత్రి పెద్దిరెడ్డి

ఈ నేపధ్యంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటినికూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.’ అని సీఎం జగన్ సభలో ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Latest Articles