Wednesday, December 1, 2021

MLC Kavitha : స్థానిక కోటా MLCగా ఇవాళ కవిత నామినేషన్ | MLC Kavitha contesting again in Local body mlc


రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. ఐతే.. స్థానిక కోటాలో ఎమ్మెల్సీగానే బరిలోకి

MLC Kavitha : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు నేటితో ముగియనున్నాయి. ప్రధాన పార్టీ టీఆర్ఎస్ పెద్దగా మార్పులు లేకుండా పాత అభ్యర్థులనే ఖరారు చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ స్థానం నుంచి.. టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత పేరునే ఖరారు చేసింది టీఆర్ఎస్ అధిష్ఠానం. మొదట ఆమెను … బండ ప్రకాశ్ స్థానంలో రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. ఐతే.. స్థానిక కోటాలో ఎమ్మెల్సీగానే బరిలోకి దిగేందుకు కవిత సిద్ధమయ్యారు.

Read This : MLC Candidates : టీఆర్‌ఎస్‌ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

మధ్యాహ్నం 1.45 కి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు కవిత. ఈ సందర్భంగా నిర్వహించే నామినేషన్ ర్యాలీలో పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. నిజామాబాద్ లో పోటీ నుంచి బీజేపీ ఇప్పటికే తప్పుకుంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఐతే… స్థానిక సంస్థల్లో తమకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో.. పోటీకి బీజేపీ దూరంగా ఉంది. నిజామాబాద్ లో తగిన సంఖ్యా బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండాలని… జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా నిర్ణయించారు. ఇండిపెండెంట్లు పోటీలో లేకపోతే… ఎమ్మెల్సీగా కవిత ఎన్నిక ఏకగ్రీవం అయ్యే చాన్సుంది.

ఇటు కరీంనగర్ జిల్లాలో నేటి తో ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఆరుగురే నామినేషన్లు వేశారు. ఐతే.. ఈసారి ఇప్పటికే 15 మంది అభ్యర్థులు 22 సెట్ల నామినేషన్లు ఫైల్ చేశారు. నిన్న సోమవారం ఒక్కరోజే 8 మంది నామినేషన్ వేశారు. వీరిలో టీఆర్ఎస్ అభ్యర్థి భాను ప్రసాదరావు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్.రమణతో కలిసి మరోసారి నామినేషన్ వేయనున్నారు భాను ప్రసాదరావు. ఇండిపెండెంట్లుగా మరి కొంతమంది నామినేషన్స్ దాఖలు చేసే అవకాశాలున్నాయి.

TRS MLC Candidates : ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు!

మహబూబ్‌నగర్‌ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో హైడ్రామా నడిచింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాతవారినే టీఆర్ఎస్ ఖరారు చేసింది. గాయకుడు సాయిచంద్ ప్రపోజల్ పై జిల్లా పార్టీ సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నుంచి వ్యతిరేకత రావడంతో.. పార్టీ నిర్ణయం మార్చుకుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలే ఇవాళ నామినేషన్లు వేయనున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles