Saturday, November 27, 2021

Chaitu Birthday: ‘బంగార్రాజు’ నుంచి మరో టీజర్


‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ బంగార్రాజు. అక్కినేని నాగార్జున‌ నటిస్తున్న ఈ సినిమాలో నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటిస్తున్నారు. క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న బంగార్రాజు మూవీకి సంబంధించిన మరో టిజర్ బయటకొచ్చింది. నవంబర్ 23న‌ చైతన్య బర్త్ డే సందర్భంగా టీజర్‌ రిలీజ్ చేశారు. ఇందులో పూల చొక్కాతో నాగ చైత‌న్య క్యూట్ లుక్స్ తో కనిపించాడు.

నాగచైతన్య జోడీగా కృతి శెట్టి నటించింది. ఇటీవలే ఆమెకు సంబంధించిన లుక్ ను కూడా మూవీ టీం విడుదల చేసింది. ‘నాగలక్ష్మి’గా కృతి ఈ మూవీలో కనిపించనుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలోని ‘బంగార్రాజు’ పాత్రను టైటిల్ గా చేసుకుని, అదే దర్శకుడితో నాగార్జున ఈ సినిమా చేస్తున్నారు. సంక్రాంతి బ‌రిలో సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles