Wednesday, December 1, 2021

Rain : మరో అల్పపీడనం .. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు | Agian Rain Forecast For Andhra Pradesh, Telangana


తెలుగు రాష్ట్రాలను వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోసారి వాతావరణ శాఖ..

Rain : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోసారి వాతావరణ శాఖ ఏపీకి వర్ష సూచన చేసింది. ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి.

దక్షిణ బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 27 వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందంది.

Water : అధిక మోతాదులో నీరు తాగుతున్నారా!..అయితే జాగ్రత్త?…

దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అలాగే తెలంగాణలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నాయంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(యూ), ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ 5, వికారాబాద్‌ జిల్లా దోమ 3, నిర్మల్‌ జిల్లా సారంగపూర్ణ, కొమ్రంబీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌, ఖమ్మం జిల్లా సతుపల్లిలో రెండు సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, ఈశాన్య రుతువపనాలతో ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మొన్న తమిళనాడు దగ్గర వాయుగుండం తీరం దాటిన అనంతరం చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

Computer Work : గంటల కొద్దీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతో గడిపేవారికి వచ్చే వ్యాధులు ఇవే

ఈసారి కూడా నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపైనే తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని, ఈ నెల 27 నుంచి ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజా నివేదికలో తెలిపింది. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం (పాక్షికంగా) జిల్లాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. దీని నుంచి కోలుకోకముందే మళ్లీ వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన చేయడం ఆందోళన కలిగిస్తోంది.

Related Articles

- Advertisement -

Latest Articles