Monday, December 6, 2021

పుష్ప ట్రైల‌ర్ ఈవెంట్ ..ఎప్పుడో తెలుసా..


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం పుష్ప‌..ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక‌మంద‌న న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబ‌ర్ 2న ఏర్పాటు చేయ‌నున్నారు చిత్ర యూనిట్.దాదాపుగా ఈ తేదీ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఇక ఆ రోజున ఇక్కడ ఈవెంట్ ను జరిపేసి, ఆ తరువాత నుంచి మిగతా భాషల్లోను ప్రమోషన్స్ జోరు పెంచుతారట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అధిగమించడం ఖాయమనే బలమైన నమ్మకంతో టీమ్ ఉంది. డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రతి పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా దేవిశ్రీ బీట్స్ అదుర్స్ అనే టాక్ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Latest Articles