Thursday, December 2, 2021

నిల‌క‌డ‌గా క‌మ‌ల్ హాస‌న్ ఆరోగ్యం..కొన‌సాగుతున్న చికిత్స‌..


విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కి రీసెంట్ గా క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నైలోని శ్రీ రామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ హాస్ప‌ట‌ల్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా తాజాగా కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. కమల్ హాసన్ కు కరోనా చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరంలో అన్ని వ్యవస్థలు సజావుగా పనిచేస్తున్నాయని వివరించారు. రక్తపోటు, షుగర్ స్థాయిలు అన్నీ అదుపులో ఉన్నాయని తెలిపారు. ఇటీవల అమెరికా వెళ్లొచ్చిన కమల్ దగ్గుతో బాధపడుతుండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది.

Related Articles

- Advertisement -

Latest Articles