Thursday, December 2, 2021

Baba bhaskar : కామెడీనా? అంటూ షోలోంచి లేచిపోయాడు.. పరువుతీసిన బాబా భాస్కర్ | The Telugu News


baba bhaskar : ఈటీవీ ప్లస్‌లో ప్రసారం అవుతున్న రెచ్చి‌పోదాం బ్రదర్ షోకు డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్‌ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మేఘన యాంకర్‌గా అలరించే ప్రయత్నం చేస్తుంది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ షోలలో చేసే చిన్న కమెడీయన్లు అంతా ఈ షోలో సందడి చేస్తున్నారు. తమదైన కామెడీతో షోలో కామెడీ పంచే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా బయటి నుంచి కూడా కొందరు గెస్ట్‌లు వస్తున్నారు. ముఖ్యంగా పంచ్ ప్రసాద్, బాబు, ఇమ్మాన్యుయేల్, నూకరాజు, ఫైమా షోలో హైలెట్‌గా నిలుస్తున్నారు.

బాబా భాస్కర్‌ కూడా తనదైన జడ్జిమెంట్‌తో దూసుకుపోతున్నారు. కొన్ని సందర్బాల్లో కంటెస్టెంట్‌లు చేసే కామెడీ కన్నా.. బాబా భాస్కర్ డైలాగ్‌లే నవ్వు తెప్పిస్తున్నాయి. అయితే మరికొన్ని సందర్భాల్లో మాత్రం బాబా భాస్కర్ అతి చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఓ స్కిట్ చూసిన బాబా భాస్కర్ తన సీటులో నుంచి లేచి వెళ్లిపోయాడు. తాజాగా ఓ స్కిట్‌లో పంచ్ ప్రసాద్, ఫైమా.. బస్సుల్లో, రైలులో, విమానంలో పల్లీలు ఎలా అమ్ముతారనే స్కిట్ చేశారు.

baba bhaskar funny comments on punch prasad in rechipodam brother show

Baba bhaskar : పరువు తీసిన బాబా

అప్పుడు బస్సులో పల్లీలు అమ్ముతున్నట్టుగా ఫైమా వస్తుంది. దీంతో ప్రసాద్ పల్లీ ఎంత అని అడుగుతాడు.. అప్పుడు ఇంతా అంటూ పల్లీ సైజ్ చూపిస్తుంది. ఆ తర్వాత రైలులో అమ్మితే ఎలా ఉంటుంది అని ప్రసాద్ అనగా.. ఓ అది ఫినిష్ అయిందా అంటూ బాబా భాస్కర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేను పోతాను అంటూ సీటు లేచి బయటకు వెళ్తున్నట్టుగా చూపెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది

Related Articles

- Advertisement -

Latest Articles