Monday, November 29, 2021

Breaking : ఆన్ లైన్ టిక్కెట్ల‌పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్.. ఇంకా ఏమ‌న్నారంటే ..


ప‌రిశ్ర‌మ కోరిన విధంగా పార‌ద‌ర్శ‌క‌త కోసం ఆన్ లైన్ టిక్కెట్ బిల్ ప్ర‌వేశ‌పెట్ట‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. అదే విధంగా థియేట‌ర్ల మ‌నుగ‌డ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బ‌తుకుతెరువు కోసం,త‌గ్గించిన టికెట్ రేట్స్ ని కాలానుగుణంగా,స‌ముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణ‌యిస్తే సినీ ప‌రిశ్ర‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు. దేశ‌మంతా ఒక‌టే జిఎస్ టి గా ట్యాక్సెస్ ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న‌ప్పుడు,టికెట్ ధ‌ర‌ల‌లో కూడా అదే వెసులుబాటు ఉండ‌టం స‌మంజ‌సం అని అన్నారు. ద‌య‌చేసి ఈ విష‌య‌మై పునరాలోచించాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆ ప్రోత్సాహం వున్న‌పుడే తెలుగు ప‌రిశ్ర‌మ నిల‌దొక్కుకోగ‌లుగుతుంద‌ని అన్నారు.



Related Articles

- Advertisement -

Latest Articles